PM Modi Song Lyrics : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచయిత అవతారం ఎత్తారు. ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియని తనలోని ఈ కోణాన్ని దేశ ప్రజలకు పరిచయం చేశారు. నవరాత్రి ఉత్సవాల కోసం ఓ పాటకు లిరిక్స్ రాశారు. గార్బో పేరుతో రూపొందిన ఈ పాటకు తనిష్క్ బాగ్చి స్వరాలు సమకూర్చగా.. సింగర్ ధ్వని భానుశాలి ఆలపించారు. మోదీ రచించిన పాట కావడం వల్ల దీన్ని ఆయన అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
సింగర్ ట్వీట్
ఈ పాటను మోదీస్వయంగా రచించిన విషయాన్ని తొలుత.. సింగర్ ధ్వని భానుశాలి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'మోదీజీ మీరు రచించిన గార్బా పాట నాతో పాటు తనిష్క్ బాగ్చికి బాగా నచ్చింది. కొత్త రిథమ్, కంపోజిషన్‌తో ఓ పాటను తీసుకురావాలని మేం అనుకున్నాం' అని ట్వీట్ చేశారు.
మోదీ రిప్లై
ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ధ్వని భానుశాలి ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా తాను గతంలోనూ పాటలు రాశానని గుర్తు చేసుకున్నారు మోదీ. 'నా సాహిత్యంతో గార్బా పాటను అందించినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల క్రితం నేను రాసిన పాట ఇది. గత జ్ఞాపకాలను ఇది నాకు గుర్తు చేసింది. కొన్ని ఏళ్లుగా నేను ఏ పాటనూ రాయలేదు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే ఓ పాటకు లిరిక్స్ రాశా. నవరాత్రి సందర్భంగా దాన్ని మీతో పంచుకుంటా' అని మోదీ ట్వీట్ చేశారు.