ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని... అత్మవిశ్వాసం, సామర్థ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు.
లఖ్నవూ విశ్వవిద్యాలయం 100ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధాని. స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు రూపొందించాలి సలహా ఇచ్చారు.
"స్థానిక నైపుణ్యాన్ని విశ్లేషించి, స్థానిక వస్తువుల కోసం వర్సిటీ ఓ కోర్సును ఎందుకు రూపొందించకూడదు? తన పరిధిలోని జిల్లాల్లో వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకు కృషి చేయకూడదు? స్థానిక వస్తువులపై వర్సిటీ పరిశోధన చేయవచ్చు. ఓ స్థానిక వస్తువుకు సంబంధించి.. బ్రాండ్, మార్కెటింగ్, ఇతర వ్యూహాలపై ఓ కోర్సు ఉంటే బాగుంటుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.