భారత దేశ స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించి.. అనంతరం మొట్టమొదటి ప్రధానిగా సేవలందించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా మహానేతకు నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నెహ్రూ దూరదృష్టిగల వ్యక్తి అని కొనియాడారు రాహుల్. సోదరభావం, సమతావాదం, ఆధునిక దృక్పథం విలువలతో దేశానికి పునాది వేసిన వ్యక్తి నెహ్రూ అని తెలిపారు.
నెహ్రూ సమాధికి నివాళి ఆర్పిస్తున్న రాహుల్ నివాళి అర్పించి తిరిగి వెళ్తున్న రాహుల్ నెహ్రుకు నివాళ్లు అర్పించిన రాహుల్, మోదీ నెహ్రూకు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
పండిత్ నెహ్రూకు నివాళి అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రధానిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
ఉత్తర్ప్రదేశ్ ప్రయోగ్రాజ్లో 1889 నవంబరు 14 జన్మించిన నెహ్రూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 1964 వరకు ప్రధానిగా సేవలందించారు. ఆయన పుట్టిన రోజును ఏటా బాలల దినోత్సవం నిర్వహిస్తారు.
ఇదీ చూడండి:పార్టీలు, ఫొటోషూట్లు.. అన్నీ 'డబుల్ డెక్కర్' బస్సులోనే!