తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా విజయంతో ప్రపంచం చూపు భారత్​ వైపు' - మోదీ సమావేశం

టీకా తయారీదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ (PM Modi meeting today) అయ్యారు. సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా(Adar Poonawalla news), భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల సహా ఏడు సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాక్సినేషన్​లో సాధించిన విజయంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని మోదీ అన్నారు.

MODI VACCINE MEET
మోదీ వ్యాక్సిన్

By

Published : Oct 23, 2021, 5:54 PM IST

Updated : Oct 23, 2021, 8:24 PM IST

దేశంలో వంద కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ అయిన నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi meeting today) సమావేశమయ్యారు. టీకా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంపై ప్రధాని చర్చించారు. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఈ భేటీకి (PM Modi meeting) హాజరయ్యారు.

భారత్​ 100కోట్ల టీకా పంపిణీ మైలురాయిని అందుకోవడంలో వ్యాక్సిన్ తయారీదారులు కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. టీకా విజయంతో ప్రపంచమంతా భారత్​ వైపు చూస్తోందన్నారు.

సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా (Adar Poonawalla news), భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఇ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల (Vaccine Company in India) ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి తీరు గురించి ప్రధానికి వివరించారు.

'మోదీ వల్లే సాధ్యం'

ప్రధానమంత్రి ముందుచూపు వల్లే ఈ ఘనత సాధ్యమైందని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా పేర్కొన్నారు. టీకా రెగ్యూలేటరీ అనుమతుల విషయంలో వేగంగా పనులు జరిగేలా మోదీ చొరవ తీసుకున్నారని చెప్పారు. మోదీ దిశానిర్దేశం లేకపోయి ఉంటే.. వంద కోట్ల డోసులు ఉత్పత్తి అయ్యేవి కాదని అన్నారు.

భవిష్యత్ మహమ్మారులపైనా..

వ్యాక్సిన్ ఉత్పత్తి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై మోదీతో చర్చించినట్లు సీరం సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్​లో ఎదురయ్యే మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తిపై పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్.. అందరికంటే ముందు ప్రభుత్వం, పరిశ్రమ కలిసి ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు వివరించారు.

వంద కోట్ల వ్యాక్సినేషన్

అక్టోబరు 21న దేశంలో వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటింది. ఇప్పటివకు 75శాతం మందికి పైగా అర్హులైన వయోజనులకు తొలి డోసు పూర్తవ్వగా.. 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.

ప్రస్తుతం దేశంలో సీరమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌‌, భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌తో పాటు స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌-డి వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బివాక్స్‌ టీకాకు అనుమతులు మంజూరు చేయనప్పటికీ ఇప్పటికే 30కోట్ల డోసుల కోసం కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:'గోవాలో డబుల్​ ఇంజన్​ వేగంతో అభివృద్ధి పరుగులు'

Last Updated : Oct 23, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details