PM Modi Manipur Visit: మణిపుర్ సహా ఈశాన్య భారతాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కొండ ప్రాంతాలు- లోయ ప్రాంతాలు అంటూ భేదాలు సృష్టించారని మండిపడ్డారు. ప్రస్తుతం.. తమ పాలనలో మణిపుర్ అభివృద్ధి, శాంతికి చిహ్నంగా ఉందని తెలిపారు.
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మణిపుర్లో మంగళవారం పర్యటించారు మోదీ. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు.
"దిల్లీలోని గత ప్రభుత్వాలు మణిపుర్‌ను విస్మరించాయి. కొండలు- లోయలు అంటూ భేదాలు సృష్టించేందుకు కుట్రపన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ హింస లేదు. గత ప్రభుత్వాల చర్యలతో మణిపుర్, ఈశాన్య భారత ప్రజలు ఏకాకిగా మిగిలిపోయారు. నేను ప్రధానినైన తర్వాత.. దేశాన్ని ఏకం చేసేందుకు చర్యలు చేపట్టాము."