తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్లిష్ట సమయంలో కేంద్ర-రాష్ట్రాల సమన్వయం భేష్​'

కొవిడ్​ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో పని చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సృజనాత్మక విధానం రూపకల్పన పేరుతో లింక్‌డ్‌-ఇన్‌ బ్లాగ్‌లో రాసిన పోస్ట్‌లో మోదీ తెలిపారు.

By

Published : Jun 22, 2021, 7:01 PM IST

Modi
మోదీ

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో పని చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో సృజనాత్మక విధానం రూపకల్పన పేరుతో లింక్‌డ్‌-ఇన్‌ బ్లాగ్‌లో రాసిన పోస్ట్‌లో మోదీ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు మరిన్ని రుణాలు సేకరించగలిగాయని తెలిపారు. దేశంలోని 23 రాష్ట్రాలు ఒక లక్షా 6వేలకోట్ల రూపాయలను అదనంగా సేకరించాయని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని అన్నారు. ఎంతో వైవిధ్యం గల భారత్‌ వంటి సమాఖ్య దేశంలో సంస్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్రాలకు జాతీయ స్థాయి విధానపరమైన సాధనాలు లభించడం సవాలు అని తెలిపారు.

అయితే దేశ సమాఖ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉంచి, కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం అనే స్ఫూర్తితో ముందుకు సాగినట్లు ప్రధాని వెల్లడించారు. రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందజేసి ప్రగతిశీల విధానాల ద్వారా అదనపు నిధులు పొందేలా చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్​'- థర్డ్​ వేవ్​లో ఇదే ప్రమాదమా?

ABOUT THE AUTHOR

...view details