కర్ణాటకలో బిట్‌కాయిన్ కుంభకోణంపై (Karnataka Bitcoin scam) విపక్షాల విమర్శలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ధైర్యంగా, విధేయతతో పనిచేయాలని మోదీ (PM Modi news) తనకు సూచించినట్లు తెలిపారు సీఎం.
రెండు రోజుల పర్యటన కోసం దిల్లీకి వెళ్లిన బొమ్మై(Bommai Bitcoin).. ప్రధాని నివాసంలో మోదీని కలిశారు. ఇరువురు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. గడిచిన వంద రోజుల్లో తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాల గురించి మోదీకి వివరించారు.
"బిట్ కాయిన్ కుంభకోణం (Karnataka Bitcoin scam) గురించి ప్రధానికి వివరించేందుకు ప్రయత్నించా. కానీ ఆందోళన చెందవద్దని ఆయన(మోదీ) నాతో అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం నిబద్ధతతో, ధైర్యంగా పనిచేయాలని సూచించారు. మిగిలిన విషయాలు వాటంతట అవే బాగవుతాయని చెప్పారు."