తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న ఆలయాలు- భారీగా తరలిన భక్తులు - temple reopen latest news

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉత్తర్వులతో ఆలయాలు, ప్రార్థన స్థలాలు తెరుచుకున్నాయి. దీంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివెళ్తున్నారు.

Place of worships reopen in Maharashtra
తెరుచుకున్న ఆలయాలు- భారీగా తరలివెళ్తున్న భక్తులు

By

Published : Nov 16, 2020, 11:25 AM IST

మహారాష్ట్రలో ఆలయాలు, ప్రార్థన స్థలాలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు భారీ సంఖ్యలో దేవాలయాలకు తరలివెళ్తున్నారు. దీపావళి తర్వాత ఆలయాలు తెరుచుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెరుచుకున్న శిర్డీ సాయిబాబా ఆలయం
సాయిబాబా ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
భౌతికదూరం పాటిస్తూ క్యూలో నిల్చొన్న భక్తులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకుంది. భక్తులు భారీగా వచ్చే అవకాశమున్న తరుణంలో.. కరోనా నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

విఠ్ఠల్​ రుక్మిణీ మందిర్​
సిద్ధివినాయక ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు
సిద్ది వినాయక ఆలయం వద్ద ద్విచక్రవాహనాలతో నిండిపోయిన పార్కింగ్​ షెడ్​

రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులతో ముంబయిలో తెరుచుకున్న సిద్ధివినాయక ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు.

నాగ్​పుర్​లోని గణేశ్​ ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తున్న భక్తులు

నాగ్​పుర్​లో కరోనా నిబంధనలను పాటిస్తూ.. తెరుచుకున్న శ్రీ గణేశ్​ టెక్డీ దేవాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలో పాల్గొన్నారు భక్తులు.

ముంబయిలో మహిమ్​ దర్గా
దర్గా వద్ద రద్దీ

ముంబయిలోని మహిమ్​ దర్గా తెరుచుకుంది. అయితే లోపలికి ప్రవేశించాలంటే మాస్కు, శానిటైజేషన్​ వంటి కరోనా నిబంధనలు తప్పనిసరి చేసినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.

ఉత్సవాల్లో పాల్గొనేవారు మాస్కులు, భౌతికదూరం వంటి కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు అధికారులు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం గ్రీన్​సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details