తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్ ట్రయల్స్​పై స్టేకు నిరాకరణ - చిన్నారులపై కొవాగ్జిన్ ట్రయల్స్​కు స్టే నిరాకరణ

2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది.

Covaxin trial
కొవాగ్జిన్ ట్రయల్స్​

By

Published : May 19, 2021, 12:19 PM IST

2-18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. చిన్నారులపై క్లినికల్ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కేంద్రం, డీసీజీఐ, భారత్ బయోటెక్ లకు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల 2-18 ఏళ్ల చిన్నారులపై కొవాగ్జిన్ రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి :సినీఫక్కీలో చోరీకి యత్నం.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details