రాజస్థాన్ సికర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖండేలా- పల్సానా రహదారిపై ఓ పికప్ వ్యాన్.. బైక్ను ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో పది మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.
న్యూఇయర్ రోజు విషాదం.. ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం.. 10 మంది మృతి - కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
ఓ పికప్ వ్యాన్.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో పది మరణించారు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. మరోవైపు, ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఘటనాస్థలిలోనే ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ సమోద్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పికప్ వ్యాన్లో ఉన్నవారు ఖండేలాలోని ఓ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
బస్సును ఢీకొట్టిన కారు..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవా నుంచి వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని అంకోలా ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులందరూ గోవాలో న్యూ ఇయర్ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైందని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని పేర్కొన్నారు.