తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా? - ట్రాన్స్‌జెండర్లు రక్తదానం పై వ్యాజ్యం

ట్రాన్స్‌జెండర్ల నుంచి రక్తం స్వీకరించకూడదంటూ 2017లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దావా వేశారు మణిపుర్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్త. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రన్ని కోరింది ధర్మాసనం.

Petition in supreme court on Transgender's Blood donation
ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?

By

Published : Mar 6, 2021, 6:41 AM IST

ట్రాన్స్‌జెండర్ల నుంచి రక్తం స్వీకరించకూడదంటూ 2017లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలయింది. రక్తదాతల జాబితా నుంచి ట్రాన్స్‌జెండర్లతో పాటు, పురుష స్వలింగ సంపర్కీయులు, మహిళా సెక్స్‌వర్కర్లను తొలగించింది. హెచ్‌ఐవీ పాజిటివ్‌, హైపటైటిస్‌ వ్యాధులు వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొంది.

అయితే శాశ్వతంగా వారిపై నిషేధం విధించడం హక్కులకు భంగకరమంటూ మణిపుర్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్త ఈ దావా వేశారు. దీనిపై సమాధానం చెప్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి:విమానం బయల్దేరే ముందు ప్రయాణికుడి షాక్​

ABOUT THE AUTHOR

...view details