Piyush jain arrested: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌కు చెందిన పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్‌కు చెందిన ప్రాంతాల నుంచి మరో రూ.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ ఎగవేత కేసులో ఆయన ఇళ్లు, ఫ్యాక్టరీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు... కన్నౌజ్‌లోని ఫ్యాక్టరీ నుంచి రూ.5 కోట్లు, పీయూష్ నివాసం నుంచి మరో రూ.5 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు విలువ రూ.187.45 కోట్లకు చేరిందని చెప్పారు.
Kanpur IT raid 150 crore
సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం పీయూష్‌ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. జైన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. నగదుతో పాటు రూ.కోట్లు విలువ చేసే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శాండల్‌వుడ్ ఆయిల్, పర్ఫ్యూమ్ వంటి ఉత్పత్తులను సీజ్ చేశామని చెప్పారు.
తనిఖీల్లో భాగంగా తొలిరోజు తనిఖీ చేస్తున్న సమయంలో.. పీయూష్ తన ఇంటి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. అనంతరం పలుమార్లు ఫోన్లు చేయగా.. రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు.