తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా గుప్పిట్లో గుజరాత్​ ప్రజలు' - గుజరాత్​ ప్రజలపై టికాయత్

గుజరాత్​ ప్రజలకు భాజపా కబంద హస్తాల నుంచి విముక్తి కలగాలని రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం మరో 7-8 నెలల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

tikait in rajasthan
'భాజపా గుప్పిట్లో గుజరాత్​ ప్రజలు'

By

Published : Mar 28, 2021, 9:56 AM IST

రైతుల ఉద్యమం మరో 7-8 నెలల వరకు కొనసాగుతుందని అన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. రైతుల డిమాండ్లను నేరవేర్చేవరకు వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. రాజస్థాన్​లోని దౌసా జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"గుజరాత్​ ప్రజలు భాజపా గుప్పిట్లో ఉన్నారు. భాజపా నుంచి వారికి విముక్తి కావాలి."

--రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత.

బంగాల్​లో ఎన్నికల నేపథ్యంలో భాజపా వాగ్దానాలను టికాయిత్ తప్పుపట్టారు. 'బంగాల్​లో 'ఏక్​ ముత్తి ఛావల్' అని భాజపా నినదిస్తోంది. కానీ, రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ముందుకు రాదు' అని భాజపాపై మండిపడ్డారు.

ఇదీ చదవండి:ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ ఫజ్జా హతం

ABOUT THE AUTHOR

...view details