ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే 'మాన్ కీ బాత్' కార్యక్రమంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇందుకు బదులుగా 'కొవిడ్ కీ బాత్' అనే చర్చను వినాలనుకుంటున్నారని తెలిపారు. టీకాలు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత మీద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మన్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి గత నెల మాట్లాడారు. కరోనా వైరస్ ఓ తుపాను లాగా దేశం మొత్తాన్ని కుదిపేసిందని అన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన దీదీ 'కొవిడ్ కీ బాత్' పేరుతో ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు.