పెగసస్ వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల గొంతు నొక్కేందుకు పెగసస్ స్పైవేర్‌ను ఆయుధంలా మోదీ ఉపయోగించారని ఆరోపించారు. భారతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన 'సంసద్ ఘెరావ్' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దేశంలో నిరుద్యోగ సమస్యపైనా రాహుల్ విమర్శలు చేశారు.
"కేవలం నా ఫోన్లోనే కాదు.. ప్రతి భారతీయ యువకుడి ఫోన్లో పెగసస్ స్పైవేర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారు. మీరు నిజం మాట్లాడితే.. పెగసస్, నరేంద్ర మోదీ పసిగడతారు. ప్రజలను మౌనంగా ఉంచేందుకు పెగసస్‌ను వినియోగిస్తున్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత