కంటి చూపు కోసం పోతే ఉన్న వెలుగును దూరం చేసింది ఆ ఆస్పత్రి. శుక్లాలు తొలగించుకుందామని శస్త్ర చికిత్స కోసం వెళ్లిన రోగులు.. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చూపు పోగొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది.
వికటించిన కంటి ఆపరేషన్.. చికిత్స కోసం వెళ్తే చూపు మాయం! - కాన్పూర్‌లో కాట్రాట్ ఆపరేషన్
కంటి చికిత్స కోసం వచ్చిన పేషెంట్లకు చూపు కోల్పోయేలా చేసింది ఓ ఆస్పత్రి. దీంతో ఆగ్రహించిన బాధితులు సీఎంఓకు ఫిర్యాదు చేశారు.
కాన్పూర్, బర్రా బైపాస్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఆరుగురికి శుక్లాల ఆపరేషన్ జరిగింది. అంతా బాగానే ఉందని వెళ్లిన వారికి నెమ్మదిగా కంట్లో ఏదో అసౌకర్యం మొదలైంది. మొదట నొప్పి వచ్చిన కంటి నుంచి నీరు వచ్చిందని బాధితులు చెప్పారు. క్రమంగా మొత్తం చూపు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకు ఏం జరిగిందని ఆస్పత్రి సిబ్బందిని ఆరా తీసేందుకు వెళ్లాగా.. వారు సరైన సమాధానం చెప్పలేదని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి విచారణకు ఆదేశించారు.