షెడ్యూల్ కంటే ముందే ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు - parliament winter session live updates
డిసెంబర్ 29 వరకు జరగాల్సిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే డిసెంబర్23న ముగియనున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే వారం ముందుగా డిసెంబర్ 23న ముగిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. డిసెంబర్ 7న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29న ముగియాల్సి ఉంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను ముందుగానే ముగించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో.. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సెషన్‌ను త్వరగా ముగించాలని నిర్ణయించారు.