తెలంగాణ

telangana

Parliament Special Session 2023 :తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయి: ప్రధాని మోదీ

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 9:47 AM IST

Updated : Sep 18, 2023, 12:28 PM IST

parliament special session 2023
parliament special session 2023

12:28 September 18

  • ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన ప్రధాని మోదీ
  • తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది: ప్రధాని
  • తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయి: ప్రధాని
  • రాష్ట్ర విభజన ఇరువర్గాలనూ సంతృప్తిపరచలేకపోయింది: ప్రధాని
  • కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింది: ప్రధాని

12:14 September 18

  • మాజీ ప్రధానుల సేవలను పేరుపేరునా కొనియాడిన మోదీ
  • సభలో జరిగిన చర్చలు, మైలురాళ్ల లాంటి నిర్ణయాలను గుర్తుచేసిన ప్రధాని
  • ఈ సభ భారత ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతీక
  • ఈ సభలో నలుగురు సభ్యులున్న పార్టీలు కూడా అధికారంలో భాగస్వాములు అయ్యాయి
  • ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి
  • మొరార్జీ దేశాయి, వీపీ సింగ్‌ జీవితకాలం కాంగ్రెస్‌లో ఉండి.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు
  • రాజకీయాలను విరమించుకుని సన్యాసం తీసుకోవాలనుకున్న పీవీ ప్రధానిగా దేశానికి కొత్త దిశానిర్దేశం చేసారు
  • ఈ పరిణామాలు భారత ప్రజాస్వామ్య విస్తృతికి నిదర్శనం
  • ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు
  • ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరువర్గాలూ అసంతృప్తికి గురయ్యాయి
  • మనం ఎప్పుడూ చరిత్రకు, భవిష్యత్తుకు సారథులుగా నిలబడి ఉన్నాం
  • చరిత్ర గౌరవాన్ని, భవిష్యత్తు ఆశలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది
  • నెహ్రూ విజయాలను ప్రస్తుతించినప్పుడు ఉప్పొంగని హృదయం ఈ సభలో ఎవరిదైనా ఉంటుందా
  • ఈ సభ సాధించిన విజయాలను గుర్తుచేసుకునేందుకు ఈ రోజంతా మీరు కేటాయించారు.. ధన్యవాదాలు..

12:04 September 18

  • ఈ సభకు 17 మంది స్పీకర్లు నేతృత్వం వహించారు: ప్రధాని మోదీ
  • మౌలంకర్ నుంచి సుమిత్రా మహాజన్‌ వరకు ఈ సభకు దిశానిర్దేశం చేశారు : ప్రధాని మోదీ
  • ఈ సభలో సభ్యులే కాదు.. వారికి సహకరించిన సిబ్బంది భాగస్వామ్యం కూడా ఎన్నదగినది: ప్రధాని మోదీ
  • పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి భవనంపై జరిగింది కాదు.. భారతీయ జీవాత్మపై జరిగిన దాడి: ప్రధాని మోదీ
  • సభ్యులను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల సాహసం జాతి ఉన్నంతకాలం గుర్తుంటుంది: ప్రధాని మోదీ
  • ఈ సభలో జరిగిన చర్చలు, నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లిన విలేకరుల భాగస్వామ్యం కూడా గొప్పది: ప్రధాని మోదీ
  • సభలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రజల ముందుంచిన పాత్రికేయులకూ భారత ప్రజాస్వామ్య విజయంలో భాగస్వామ్యం ఉంది: ప్రధాని మోదీ
  • స్ట్రోక్ ఆఫ్ ద మిడ్‌నైట్ అన్న పండిట్ నెహ్రూ స్వరం మన చెవుల్లో నిరంతరం గింగిర్లు తిరుగుతుంటుంది: ప్రధాని మోదీ
  • ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఈ దేశం శాశ్వతమన్న వాజ్‌పేయీ మాటలు నిరంతరం మననంలోకి వస్తుంటాయి: ప్రధాని మోదీ

11:49 September 18

  • ఈ సభకు ప్రాతినిధ్యం వహించిన అందరికీ ఈ సభతో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది: ప్రధాని
  • పాతిక, ముప్పై ఏళ్ల తర్వాత కూడా సెంట్రల్ హాలుకు వచ్చి వెళ్తుంటారు: ప్రధాని
  • స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత భవిష్యత్తుపై అనేక అనుమానాలు వెల్లడించారు: ప్రధాని
  • భారత ప్రజాస్వామ్య ప్రయాణం ఆ అనుమానాలను పటాపంచలు చేసింది: ప్రధాని
  • ప్రపంచంలో బలమైన దేశంగా గెలిచి నిలిచింది: ప్రధాని మోదీ
  • ఈ 75 ఏళ్లలో పార్లమెంటు జన భావనలకు దర్పణం పట్టింది: ప్రధాని
  • ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈ భవనం వేదికైంది: ప్రధాని మోదీ
  • నెహ్రూ నుంచి వాజపేయీ, మన్మోహన్‌సింగ్ వరకు ఈ సభకు నేతృత్వం వహించారు: ప్రధాని మోదీ
  • అనేకమంది ఉద్ధండులు ఈ సభలో ప్రజా ప్రయోజనాల ఉపన్యాసాలు వెలువరించారు: ప్రధాని
  • చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయి: ప్రధాని
  • ప్రధానులుగా ఉన్నప్పుడే నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ దివంగతులయ్యారు: ప్రధాని

11:42 September 18

  • తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా వచ్చినప్పుడు ఈ భవనం గడపకు శిరసా నమస్కరించా: ప్రధాని మోదీ
  • ఈ భవనం భారత ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక
  • ఈ దేశంలోని అన్నివర్గాల ప్రజల భావనలకు ఈ భవనం ప్రతీక
  • రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడు
  • ఇది భారత ప్రజాస్వామ్య చేతనకు నిదర్శనం
  • వివిధత్వానికి ప్రతీకైన భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఈ భవనం భాగస్వామ్యం కల్పించింది
  • దళితులు, ఆదివాసీలు, మధ్యతరగతి, మహిళలకు ఈ సభ అవకాశం కల్పించింది
  • స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఈ సభలో మహిళలు తక్కువమంది ఉండేవారు
  • మహిళల సంఖ్య కాలక్రమంలో పెరుగుతూ వచ్చింది
  • ఈ 75 ఏళ్లలో 7,500 ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారు
  • ఇంద్రజిత్ గుప్తా 43 ఏళ్లపాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారు
  • 25 ఏళ్ల చంద్రమణి ముర్ము ఈ సభకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలు

11:35 September 18

  • జీ-20 విజయం 140 కోట్ల మంది భారతీయులది: ప్రధాని మోదీ
  • జీ-20 విజయం ఒక పార్టీదో, ఒక వర్గానిదో కాదు: ప్రధాని మోదీ
  • జీ-20లో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన వందల సమావేశాలకు అనేక నగరాలు వేదికయ్యాయి: ప్రధాని
  • జీ-20 సమావేశ నిర్వహణ భారత ప్రతిష్ఠనుమరింత పెంచింది: ప్రధాని మోదీ
  • మనదేశ సామర్థ్యాన్ని, నిర్వహణ కౌశలాన్ని దేశాలన్నీ ప్రశంసించాయి: ప్రధాని
  • జీ-20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను తీసుకోవడం చారిత్రక ఘట్టం: ప్రధాని
  • నేడు ప్రపంచానికి భారత్‌ మిత్రదేశంగా రూపొందింది: ప్రధాని మోదీ
  • ప్రపంచంలో ప్రతి దేశం భారత్‌ను మిత్రదేశంగా పరిగణిస్తోంది: ప్రధాని
  • భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైంది: ప్రధాని
  • ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయి: ప్రధాని
  • ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి: ప్రధాని
  • చర్చలు, వాదనలు ఎన్ని ఉన్నా ఈ భవనం మన గౌరవాన్ని పెంచింది: ప్రధాని
  • 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు ఈ భవనం వేదికైంది: ప్రధాని మోదీ

11:28 September 18

  • ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నాం: ప్రధాని
  • స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేది
  • పార్లమెంటు భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది: ప్రధాని మోదీ
  • మనం కొత్త భవనంలోకి వెళ్లినా ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది: ప్రధాని
  • ఈ భవనం భారత్‌ సువర్ణాధ్యాయానికి సాక్షిభూతం: ప్రధాని
  • ఈ భవనంలో జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి: ప్రధాని
  • భారత అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం మనకు కనిపిస్తుంది: ప్రధాని
  • భారత్‌ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి: ప్రధాని
  • 75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపరిచింది: ప్రధాని
  • చంద్రయాన్‌-3 భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనం: ప్రధాని
  • భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నా: ప్రధాని

11:11 September 18

  • జీ-20 సదస్సు విజయవంతమైనందుకు అందరికీ గర్వంగా ఉంది: స్పీకర్‌
  • జీ-20 సదస్సు విజయవంతం చేసిన ప్రధానికి అభినందనలు: స్పీకర్‌
  • జీ-20 సదస్సు ద్వారా మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసింది: స్పీకర్
  • ప్రధాని మోదీ విజన్‌, సమర్థత వల్లే ఇదంతా సాధ్యమైంది: స్పీకర్‌
  • గాంధీజీ ప్రబోధించిన శాంతి, అహింస మనకు ఎప్పుడూ స్ఫూర్తి: స్పీకర్‌
  • డిజిటలైజేషన్‌ దిశంగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది: స్పీకర్‌
  • మనదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది: స్పీకర్‌
  • కాలుష్య నిర్మూలనకు అన్ని దేశాలు నడుం బిగించాలి: స్పీకర్‌

11:07 September 18

  • లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన

10:39 September 18

  • జీ-20 సదస్సు అద్భుతంగా జరిగింది: ప్రధాని మోదీ
  • భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ-20 సదస్సు మార్గదర్శనం చేసింది: ప్రధాని
  • చంద్రయాన్‌-3 విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి: ప్రధాని
  • ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోంది: ప్రధాని మోదీ
  • కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలి: ప్రధాని మోదీ
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది: ప్రధాని మోదీ
  • భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి: ప్రధాని మోదీ
  • దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది: ప్రధాని మోదీ
  • భారత అభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా: ప్రధాని మోదీ
  • ఈ పార్లమెంటు సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటాం: ప్రధాని

10:35 September 18

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రసంగించిన ప్రధాని.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. భారత్‌ అభివృద్ధిని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

10:31 September 18

  • జీ-20 సదస్సు అద్భుతంగా జరిగింది
  • భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ-20 సదస్సు మార్గదర్శనం చేసింది
  • చంద్రయాన్‌-3 విజయంతో దేశానికి పేరు వచ్చింది
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది

10:25 September 18

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంట్​లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.ప్రస్తుత పరిస్థితులన్నీ భారత్‌ ఉజ్వల భవిష్యత్‌ను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌ 3, జీ 20 శిఖరాగ్ర సదస్సులు విజయవంతం కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

09:25 September 18

Parliament Special Session 2023 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం

Parliament Special Session 2023 :సార్వత్రిక సమరానికి ముందు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు సభలో ప్రసంగించనున్నారు. ఆయన ఏం అంశంపై మాట్లాడతారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో విపక్షాలు మరికాసేపట్లో సమావేశం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి.

పార్లమెంటు ప్రత్యక సమావేశాలు సోమవారం నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి. పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై చర్చే ప్రధాన అజెండాగా.. పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్​డీఏ ప్రభుత్వం చెబుతున్నా.. ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. అజెండాలో లేని కొత్త చట్టాలు, ఇతర అంశాలను పార్లమెంటులో ప్రవేశపెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే పార్లమెంట్‌లో ఈసారి అనూహ్య అంశాలు జరగవచ్చని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అంతకుముందు.. ఈ సెషన్‌ను ప్రత్యేక సమావేశంగా అభివర్ణించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. తర్వాత ఇది సాధారణ సెషన్ మాత్రమేనన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఈ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు సహా జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై.. కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని బీఆర్​ఎస్, బీజేడీ సహా పలు ప్రాంతీయ పార్టీలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేశాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్లు ఆయా ప్రాంతీయ పార్టీలు పేర్కొన్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక సంక్షోభం, మణిపుర్ తదితర అంశాలను తమ పార్టీ లేవనెత్తనున్నట్లు.. కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ తెలిపారు.

Last Updated : Sep 18, 2023, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details