కొవిడ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఉభయ సభల్లోని పలు పార్టీ పక్ష నేతలు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశానికి హాజరు కావద్దని కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ నిర్ణయించాయి. తాము సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడం లేదని, గైర్హాజరు మాత్రమే అవుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వివరించారు.