రాజ్యసభ మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది.
విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా - లోక్ సభ సమావేశాలు
16:44 August 09
15:15 August 09
ట్రైబ్యునళ్ల సంస్కరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దల సభలోనూ గట్టెక్కింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 3:30 గంటల వరకు వాయిదా పడింది.
14:22 August 09
పెగసస్‌పై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది.
12:56 August 09
లోక్‌సభ వాయిదా
పెగసస్‌పై ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.
12:54 August 09
లోక్‌సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం
లోక్‌సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. షెడ్యూల్డ్ తెగల సవరణ బిల్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ బిల్లు, పరిమిత భాగస్వామ్య సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
12:25 August 09
లోక్‌సభ వాయిదా
పెగసస్‌పై ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ మధ్యాహ్నం 12.30గంటలకు వాయిదా పడింది.
12:07 August 09
రాజ్యసభ వాయిదా
పెగసస్‌పై విచారణకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. సభ ముందుకు సాగలేని పరిస్థితుల్లో మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్.
11:48 August 09
రాజ్యసభ వాయిదా
పెగసస్‌పై ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది.
11:41 August 09
లోక్‌సభ వాయిదా
పెగసస్‌పై ఆందోళన కొనసాగడం వల్ల లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్.
11:08 August 09
పార్లమెంట్ లైవ్
లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్‌తోపాటు ఇతర వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక లోక్‌సభను స్పీకర్ సభను 11.30గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభను ఛైర్మన్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు.
అంతకు ముందు క్విట్ ఇండియా వార్షికోత్సవం నేపథ్యంలో అమరవీరులకు సభ్యులు నివాళులర్పించారు. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాతో పాటు పతకాలు సాధించిన ఇతర క్రీడాకారులను లోక్‌సభ ప్రత్యేకంగా అభినందించింది.
సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటులో విపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ చర్చించారు.
ఇదిలా ఉంటే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఈ బిల్లును కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ ప్రవేశపెట్టనున్నారు.