తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారి నేత్రదానం.. ఆగ్రాలో యంగెస్ట్​ డోనర్​గా నిలిచి.. - కార్నియాను దానం చేసిన చిన్నారి ఆగ్రా

ఓ ఐదేళ్ల బాలిక చనిపోతూ మరొకరి జీవితంలో వెలుగులు నింపింది. చనిపోయిన ఆ చిన్నారి నేత్రాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి ఆగ్రాలో ఈ ఏడాది నేత్రదానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

Eye donation of five year old girl in Agra
నేత్రదాత కేతి అగర్వాల్​

By

Published : Dec 16, 2022, 10:47 PM IST

తాను చనిపోయినా సరే వేరొకరి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ ఐదేళ్ల చిన్నారి. ఉత్తర్​ప్రదేశ్​లో చనిపోయిన ఓ చిన్నారి నేత్రాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి ఆగ్రాలో ఈ ఏడాది నేత్రదానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

కేతి అగర్వాల్​

ఆగ్రాలో గురువారం ఉదయం 8:30 గంటలకు వివేక్​ అగర్వాల్​ కుమార్తె కేతి అగర్వాల్​ అకస్మాత్తుగా మరణించింది. బాలిక తల్లిదండ్రులు.. పాప నేత్రాలు దానం చేయలని నిర్ణయించుకున్నారు. వెంటనే దగ్గర్లోని ఎస్​ఎన్ మెడికల్​ కాలేజీలో 'ఐ' బ్యాంక్​ ఇన్​ఛార్జ్​ డాక్టర్ షెఫాలీ మజుందార్‌ను సంప్రదించారు. వైద్య కళాశాల నుంచి ఒక బృందం వచ్చి చిన్నారి రెండు కళ్లల్లోని కార్నియాలను తీసి భద్రపరిచారు. ప్రస్తుతం మృతురాలి తండ్రి వివేక్​ అగర్వాల్​.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆగ్రా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్​గా విధులు నిర్విర్తిస్తున్నారు. చనిపోయిన 6 గంటల వ్యవధిలో నేత్రదానం చేయవచ్చని డాక్టర్​ మంజుదార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details