కరోనా రోగుల్లో సహజంగానే ఆక్సిజన్(Oxygen) స్థాయి 93-94% మేర ఉంటే వెంటనే ఆక్సిజన్ థెరఫీని(Oxygen therapy) నిలిపేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఆక్సిజన్(Oxygen) వినియోగం అధికమైతే అది కార్బన్‌డై ఆక్సైడ్ స్థాయి పెంపునకు దారి తీస్తుందని తెలిపింది. దానివల్ల ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా(Covid-19) రోగులకు ఆక్సిజన్ వినియోగించాల్సిన తీరును వివరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది.
- వైద్య సిబ్బంది సమక్షంలోనే ఆక్సిజన్ థెరఫీ(Oxygen therapy) ఇవ్వాలి.
- అత్యవసర సమయాలు, వైద్య సేవల కోసమో, ఆంబులెన్స్ కోసమో ఎదురు చూస్తున్నప్పుడు తాత్కాలికంగా సొంతంగానే దీన్ని ఉపయోగించవచ్చు.
- ఒకసారి ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు శరీరంలోకి కణాలకు ప్రాణవాయువు అందదు. దానివల్ల అవి సహజంగా పనిచేయలేవు.
- ఆ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే అవయవాలు సరిగా పనిచేయవు. అది క్రమంగా మరణానికి దారితీస్తుంది.
కాన్సంట్రేటర్లు ఎప్పుడు పెట్టాలి?
- ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కేవలం మధ్యస్థాయి కొవిడ్ కేసుల్లోనే ఉపయోగించాలి.
- రోగిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నట్లు అనిపించినప్పుడు, నిమిషానికి గరిష్ఠంగా 5 లీటర్ల ఆక్సిజన్ అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి.
- కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఆక్సిజన్ థెరీఫీ(Oxygen therapy) ఇవ్వడానికి కాన్సంట్రేటర్లు ఉపయోగపడుతాయి.
లక్షణాలు ఏమిటి?
- ఆక్సిజన్ తగ్గిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.
- అయోమయంగా ఉంటుంది.
- నడవడం కష్టమవుతుంది.
- మొహం, పెదవులు నీలంగా మారుతాయి.
- అదే పెద్దల్లో అయితే ఛాతీనొప్పి వచ్చి, అలాగే కొనసాగుతుంది.
- పిల్లల్లో అయితే ఊపిరి తీసుకొనేటప్పుడు ముక్కు రంధ్రాలు ఎర్రబారుతాయి.
- ఊపిరి తీసుకొనేటప్పుడు శబ్దం వస్తుంది.
- ఏమీ తాగలేరు, తినలేరు.
93 శాతం కన్నా తగ్గితే ముప్పే
- ఆక్సిమీటర్‌లో 94%లోపు ఆక్సిజన్ స్థాయి చూపించినప్పుడు ఇంట్లోనే బోర్లాపడుకొని ఊపిరి తీసుకోవడం ప్రారంభించాలి.
- దానివల్ల రక్తంలో ఆక్సిజన్‌స్థాయి పెరుగుతుంది.
- ఆక్సిజన్ స్థాయి 93 శాతం, ఆలోపునకు పడిపోయినప్పుడు రోగికి త్వరగా వైద్యం అందించాలి.
- 90%కంటే తక్కువకు పడిపోయినప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భావించాలి.