కేరళలో కొవిడ్ మహమ్మారి(Corona virus) కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 20,240 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 22,551కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.51శాతంగా ఉంది. కేరళలో క్రియాశీల కేసుల సంఖ్య 2,22,255గా ఉన్నట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- మహారాష్ట్రలో కొత్తగా 3,623 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.04గా ఉంది.
- కర్ణాటకలో కొత్తగా 803 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 649 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వారిలో 103 మంది చిన్నారులు ఉన్నారు. కొత్తగా మరో ఆరుగురు మృతిచెందారు.
- మిజోరాంలో తాజాగా 1,089 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. అందులో 245 మంది చిన్నారులు ఉన్నారు. వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించారు.