తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 6.75 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ

దేశంలో ఇప్పటి వరకు 6.75 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 17,47,094 లక్షల టీకా డోసులు అందించినట్లు తెలిపింది.

COVID vaccine doses administered in India
కరోనా టీకా డోసుల పంపిణీ

By

Published : Apr 2, 2021, 5:04 AM IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గురువారం సాయంత్రం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 6,75,36,392 కోట్ల కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే.. 17,47,094 లక్షల డోసులు అందించినట్లు తెలిపింది.

జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్​ ప్రక్రియను ప్రారంభించింది భారత్​. ఫిబ్రవరి 2 నుంచి కరోనా యోధులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తోంది.

మొత్తం టీకా డోసుల పంపిణీలో.. 88,48,558 ఆరోగ్య కార్యకర్తలు తొలి డోసు తీసుకున్నారు. 52,63,108 మంది రెండో డోసు అందుకున్నారు. ఫ్రంట్​లైన్​ వర్కర్స్​లో 93,99,776 మంది తొలి డోసు, 39,18,646 మంది రెండో డోసు తీసుకున్నారు. అలాగే.. 45 ఏళ్లు పైబడిన వారు 4,01,06,304 మంది ఉన్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో కరోనా పంజా- కొత్తగా 43 వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details