దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్లోనూ ఇదే స్థాయిలో వ్యాక్సిన్ నిరుపయోగం అవుతోందన్నారు. టీకాలు ఎందుకు వృథా అవుతున్నాయో ఆయా రాష్ట్రాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు సాయంత్రం టీకా పంపణీని పర్యవేక్షించి, వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఆసక్తితో ఉన్నవారికి వాటిని అందించాలని సూచించారు. దీని వల్ల వ్యాక్సిన్లు వృథా కావని తెలిపారు.