అమెరికాకు చెందిన కరోనా వ్యాక్సిన్ (covid vaccine) ఫైజర్.. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కొవిడ్ వేరియంట్లో ఒకటైన సార్స్- కోవ్-2ను తమ టీకా సమర్థవంతంగా ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సురక్షితమని పేర్కొంది. అంతేగాక నిల్వచేసుకోవడం(storage) కూడా మిగతా టీకాలతో పోల్చితే మరింత సులభమని వివరించింది. నెల పాటు 2 నుంచి 8 డిగ్రీల వద్ద దీనిని భద్రపరుచుకోవచ్చని స్పష్టం చేసింది.
PFIZER: '12 ఏళ్లు పైబడిన వారికి మా టీకా సురక్షితం' - pfizer vaccine covid
దేశంలో విజృంభిస్తున్న కరోనా వేరియంట్‌పై తమ టీకా(vaccine) సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్రానికి తెలిపింది ఆమెరికాకు చెందిన ఫైజర్(pfizer) సంస్థ. భారత్‌లో అత్యవసర వినియోగానికి (Emergency Use Authorisation) అనుమతులు ఇస్తే.. జులై అక్టోబర్ మధ్యకాలంలో 5 కోట్ల డోసులను అందిస్తామని స్పష్టం చేసింది.
'12ఏళ్లు పైబడిన వారిపై సమర్థవంతంగా ఫైజర్'
ఈ ఏడాది జులై, అక్టోబర్ మధ్య కాలంలో భారత్‌కు 5 కోట్ల డోసులను అందించడానికి ఫైజర్(pfizer) సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే పలుమార్లు భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో సమావేశం అయిన ఫైజర్ ప్రతినిధులు.. కరోనాపై టీకా ఏవిధంగా పనిచేస్తుందనే అంశాన్ని వివరించారు. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇతర దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇదీ చూడండి:'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'