బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ కుటుంబ సభ్యుల ఔదార్యం.. ఓ యువతి జీవితంలో కొత్త వెలుగులు నింపనుంది. 52 ఏళ్ల మహిళ చేతులను ముంబయికి చెందిన యువతికి ట్రాన్స్‌ప్లాంట్ చేయనున్నారు. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో మొట్టమొదటిదని మహాత్మ గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సందీప్ దీక్షిత్ చెప్పారు.
వినిత ఖజంచి అనే 52 ఏళ్ల మహిళ ఇందోర్‌లో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త సునిల్ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. జనవరి 13న మెదడు సంబంధిత సమస్యతో వినిత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత ఆమెను బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అవయవ దానానికి ఆమె కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చారు. చేతులతో పాటు చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు దానం చేశారు. ఆమె చేతులను ప్రత్యేక విమానంలో సోమవారం ముంబయికి పంపించారు. వీటిని పుట్టుకతోనే చేతులు లేని ఓ 18 ఏళ్ల యువతికి ట్రాన్స్‌ప్లాంట్ చేయనున్నారు.