తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆఖరి తేదీ​ ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు గుడ్​న్యూస్​. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుదారులు మే 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు విద్యార్హత, జీతం ఎంతంటే?

ordnance factory itarsi notification
ordnance factory itarsi notification

By

Published : Apr 24, 2023, 3:17 PM IST

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మధ్యప్రదేశ్‌ ఇటార్సీలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంతకీ ఉద్యోగాలెన్ని? అప్లై చేసుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు? ఇవన్నీ ఓ సారి తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తుదారులు munitionsindia.co.in అనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు. అందులో విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వంటి వివరాలు ఉంటాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు తొలుత అధికారిక వెబ్​సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి. ఈ ఫారమ్​ను నింపి.. సంబంధిత అడ్రస్​కు పంపాలి.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ప్రారంభ తేదీ ఏప్రిల్ 18న కాగా.. ఆఖరి గడువు మే 5. అలాగే ఆఫ్​లైన్​లో దరఖాస్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ అడ్రస్​కు నిర్ణీత గడువులోగా పంపాలి. వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​సర్వీస్​మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

  • మొత్తం ఉద్యోగాలు : 100
  • అన్​ రిజర్వ్​డ్​కు కేటాయించిన ఉద్యోగాలు: 40
  • ఓబీసీ: 15
  • ఎస్సీ: 15
  • ఎస్టీ: 20
  • ఈడబ్ల్యూఎస్​: 10
  • ఎక్స్​సర్వీస్​మెన్​: 10
  • అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ: మే 5
  • అర్హత: ఏవోసీపీ ట్రేడులో ఎక్స్‌ అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: 01/04/2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • పరీక్ష తేదీ: ఇంకా వెల్లడించలేదు.
  • ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన
  • జీతభత్యాలు: రూ.19,900+డీఏ
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జనరల్ మేనేజర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ, నర్మదపురం జిల్లా, మధ్యప్రదేశ్ చిరునామాకు పంపాలి.

BSF నోటిఫికేషన్..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF).. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి బీఎస్‌ఎఫ్ ప్రస్తుతం ఆసక్తికర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏప్రిల్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మే 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్(ఆర్‌ఓ), హెచ్‌సీ రేడియో మెకానిక్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిపి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2023 పేరిట తాజాగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్స్(ఆర్‌ఓ) పోస్టులు 217 ఉండగా.. హెచ్‌సీ రేడియో మెకానిక్స్(ఆర్‌ఎం) పోస్టులు 30 ఉన్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details