Tek Fog app: దేశ రాజకీయాల్లో మళ్లీ గూఢచర్యం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 'టెక్ ఫాగ్' అనే యాప్ సాయంతో భాజపా ఐటీ విభాగం సామాజిక మాధ్యమాలను హైజాక్ చేస్తోందని.. సొంత ఎజెండాను విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ సహా కొన్ని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పౌరుల గోప్యతకు ఈ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ది వైర్' వార్తాసంస్థ అసలేంటీ యాప్? దాని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు? అనే వివరాలతో ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..
ఎలా ప్రవేశిస్తుంది?
‘టెక్ ఫాగ్’ ఓ ప్రైవేటు యాప్. అత్యాధునిక సాంకేతికతల సాయంతో దాన్ని రూపొందించారు. భాజపా ఐటీ విభాగానికి చెందిన అసంతృప్త ఉద్యోగిగా తనను తాను పేర్కొన్న ఓ వ్యక్తి.. 2020 ఏప్రిల్‌లోనే ఈ రహస్య యాప్ ఉనికిని ట్విటర్ వేదికగా బయటపెట్టారు. తొలుత మీడియా ఫైల్ రూపంలో ఓ స్పైవేర్‌ను యాప్ నిర్వాహకులు గుట్టుగా పంపిస్తారు. దానిద్వారా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.
దీని చేతుల్లోనే ‘ట్రెండింగ్’
ట్విటర్‌లో ‘ట్రెండింగ్’ సెక్షన్‌ను, ఫేస్‌బుక్‌లో ‘ట్రెండ్’ విభాగాన్ని ఈ యాప్ ప్రభావితం చేస్తుంది. ఆయా వ్యక్తులు/బృందాలు చేసే ట్వీట్లను ‘ఆటో రీట్వీట్’, ‘ఆటో షేర్’ ఐచ్ఛికాల ద్వారా ఈ యాప్ నిర్వాహకులు వేగంగా రీట్వీట్ చేయొచ్చు. షేర్ చేయొచ్చు. తమ భావజాలాన్ని వాస్తవ తీరు కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందించొచ్చు. ఫలితంగా ఏది నిజమో, ఏది కల్పితమో తెలుసుకోవడం ప్రజలకు కష్టమవుతుంది.
క్రియారహిత వాట్సప్ ఖాతాలతో..