దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నందున.. తక్షణమే పార్లమెంట్ అత్యవసర సమావేశాల ఏర్పాటుకు ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రతిపక్షాలు కోరాయి. కనీసం రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి.
"ప్రస్తుతం మనం ఎన్నడూలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు అందుబాటులో లేవు. భాజపాకు చెందిన నీరోలు బంగాల్ రాజకీయంలో మునిగిపోయారు. తక్షణమే రెండు రోజుల అత్వవసర పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా నేను రాష్ట్రపతిని కోరుతున్నాను. "
-మనీశ్ తివారీ, కాంగ్రెస్ ఎంపీ
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం.. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా వెంటనే పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ట్విట్టర్ ద్వారా సూచించారు.