తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెగసస్​పై మోదీని ప్రశ్నిస్తూ విపక్షాల 3 నిమిషాల వీడియో - మల్లికార్జున ఖర్గే పెగసస్

పెగసస్ అంశంపై మోదీ ప్రభుత్వం చర్చకు సహకరించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్​లో ఈ వ్యవహారంపై చర్చించేందుకు విపక్ష సభ్యులు చేసిన ప్రయత్నాలపై వీడియో వీడియో విడుదల చేశాయి. పార్లమెంట్​లో అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించాయి.

pegasus
పెగసస్

By

Published : Aug 8, 2021, 7:33 PM IST

పార్లమెంట్​లో పెగసస్​ అంశంపై చర్చించేందుకు తాము చేసిన ప్రయత్నాలను పట్టించుకోవాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పెగసస్ విషయంపై రాజ్యసభలో విపక్ష సభ్యులు మాట్లాడిన ప్రసంగాల వీడియోను కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లికార్జున ఖర్గే ట్విట్టర్​లో విడుదల చేశారు. ప్రధాని ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

"పీఎం మోదీ తన ధైర్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్​లో అడిగే ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? చర్చకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవాలు ప్రజల్లోకి రాకుండా ఉండేందుకు భాజపా ప్రభుత్వమే కార్యకలాపాలను అడ్డుకుంటోంది."

-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత

ఈ వీడియోలో ఎన్​సీపీ నేత వందనా చవాన్, మనోజ్ ఝా(ఆర్​జేడీ), దీపిందర్ హుడా(కాంగ్రెస్), సుఖేందు శేఖర్ రాయ్(టీఎంసీ), కే కేశవరావు(టీఆర్ఎస్) సహా మరికొందరు నేతలు కనిపించారు.

అధికారిక మాధ్యమాల ద్వారా తమను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని.. అందుకే బిల్లులపై చర్చ సందర్భంగా పెగసస్ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు. విపక్షాలు అనుసరించిన వ్యూహాన్ని సమర్థించారు. వచ్చే వారం సైతం విపక్షాలు అదే వ్యూహాన్ని అనుసరిస్తాయని సీపీఎం నేత, రాజ్యసభ ఎంపీ ఎలమారం కరీమ్ పేర్కొన్నారు. ఈ విధంగానే ప్రభుత్వం తమ మాట వింటుందని అన్నారు.

పార్లమెంట్​కు అవమానం: థరూర్

మరోవైపు, పెగసస్ విషయంపై త్వరలో పార్లమెంటరీ స్థాయీసంఘంలో చర్చ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. జులై 28న జరిగిన సమావేశానికి భాజపా ఎంపీలు అంతరాయం కలిగించారని అన్నారు. అధికారులకు సైతం భేటీకి రావొద్దని సూచనలు అందినట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

అదే సమయంలో పార్లమెంట్​లో చర్చ జరగకపోవడానికి కాషాయ పార్టీదే బాధ్యత అని థరూర్ విమర్శించారు. ప్రజాస్వామ్య దేవాలయం వంటి పార్లమెంట్ వేదికను.. తమ అజెండాను అమలు చేసేందుకు రబ్బర్ స్టాంప్​లా భాజపా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. చర్చకు సహకరించకపోవడం పార్లమెంట్​కు అవమానకరమని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details