తెలంగాణ

telangana

ETV Bharat / bharat

One Nation One Election Committe : 'పార్టీలు, లా కమిషన్​ అభిప్రాయలు తీసుకుంటాం'.. జమిలి కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయం

One Nation One Election Committe : ఒకేదేశం ఒకేఎన్నిక సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటైన 8 సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. తొలి సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంది.

One Nation One Election Committe
One Nation One Election Committe

By PTI

Published : Sep 23, 2023, 5:09 PM IST

Updated : Sep 23, 2023, 5:27 PM IST

One Nation One Election Committe : జమిలి ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పింది. దీంతో పాటు లా కమిషన్​ సలహాలను సైతం తీసుకుంటామని స్పష్టం చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. శనివారం తొలిసారిగా సమావేశమైంది. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వర్చువల్​గా హాజరు కాగా.. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి హాజరు కాలేదని కమిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది. కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్‌ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. కమిటీలో కాంగ్రెస్‌ MP అధీర్‌ రంజన్‌ చౌదరి పేరును కేంద్రం సిఫార్సు చేసినా.. తాను ఉండబోనని ఆయన చెప్పారు. కమిటీ స్వతంత్రంగా కాక.. కేంద్రం చెప్పినట్లే వింటుందని అనుమానం వ్యక్తం చేశారు.

జమిలి ఎన్నికల సాధ్యానికి అవసరమయ్యే రాజ్యాంగ సవరణలు, వాటికి రాష్ట్రాల అంగీకారం అవసరమా.. ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాకపోతే.. కాలవ్యవధులపై సిఫార్సులు వంటి పనులను కేంద్రం.. కమిటీకి నిర్దేశించింది. వీటితోపాటు జమిలి ఎన్నికలకు పెద్దమొత్తంలో అవసరమయ్యే ఎన్నికల పరికరాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. 1952 నుంచి కొన్నేళ్లు ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించి మధ్యలో ఆ పద్ధతి మారడాన్ని తెలుసుకున్న కేంద్రం.. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలని కమిటీకి సూచించింది.

One Nation One Election Committee Members : 'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు .. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది. రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.

One Nation One Election Possibilities In India : జమిలి ఎన్నికలు సాధ్యమేనా? విపక్షాలు ఒప్పుకుంటాయా? అసలేంటి లాభం!

One Nation One Election Committee : జమిలి ఎన్నికలపై కసరత్తు ముమ్మరం.. రామ్​నాథ్​ ఇంట్లో కీలక భేటీ

Last Updated : Sep 23, 2023, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details