జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముష్కరులు దాగి ఉన్నారనే సమాచారం మేరకు దళాలుతనిఖీలు చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి, జవాను వీరమరణం పొందారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఆర్మీ అధికారి, జవాన్ వీరమరణం - ఎన్కౌంటర్లో జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది వీర మరణం పొందారు. పూంఛ్ జిల్లాలోని మెందార్ సబ్డివిజన్లో కొద్ది రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెాందారు.
జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్
ఇటీవల జరిగిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు చనిపోగా.. ముష్కరులను మట్టుపెట్టేందుకు దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:పాక్ గూఢచారి సంస్థకు రహస్యాల చేరవేత- జవాన్ అరెస్టు
Last Updated : Oct 15, 2021, 10:27 AM IST