తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కలుషిత ఆహారం తిని బాలిక మృతి.. 50 మందికి అస్వస్థత - food poison news

సంప్రదాయ వేడుకలో కలుషిత ఆహారం(Food Poison) కారణంగా ఓ బాలిక మృతి చెందగా.. 50మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ​అసోం కార్బీ ఆంగ్లోంగ్​ జిల్లా అర్లంగ్‌పిరా​ గ్రామంలో జరిగింది.

food poisoning
కలుషిత ఆహారం తిని.. 50 మందికి అస్వస్థత

By

Published : Oct 16, 2021, 8:53 AM IST

​అసోం కార్బీ ఆంగ్లోంగ్​ జిల్లాలో జరిగిన సంప్రదాయ వేడుకలో కలుషిత ఆహారం(Food Poison) తిని.. ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అర్లంగ్‌పిరా​ గ్రామంలో శుక్రవారం జరిగింది.

ఈ సంప్రదాయ వేడుకలో ఆహారం తిన్న కొన్ని క్షణాల్లోనే.. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో(food poison symptoms) అవస్థలు పడ్డారు. బాధితులను తర్వాత వారిని బోకజన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఓ బాలిక మరణించిందని అధికారులు తెలిపారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు.. ఆ గ్రామాన్ని చేరుకుని పరిస్థితిపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఉగ్ర ఏరివేత: 8 ఎన్​ కౌంటర్లు.. 11మంది ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details