తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలిదశలో కోటి మంది ఆరోగ్య సిబ్బందికి టీకా!

కరోనా తొలి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో సుమారు కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు టీకా అందించనుంది ప్రభుత్వం. ఇప్పటివరకు రాష్ట్రాలు అందించిన సమాచారం మేరకు 92 శాతం ప్రభుత్వ, 55 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.

VIRUS-DATABASE HEALTHCARE WORKERS
కరోనా వ్యాక్సిన్

By

Published : Nov 24, 2020, 1:04 PM IST

కరోనా టీకా అందుబాటులోకి రాగానే తొలుత ఆరోగ్య కార్యకర్తలకే ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనుంది. అన్ని రాష్ట్రాల్లోని 92 శాతం ప్రభుత్వ, 55 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి రాష్ట్రాలు అందించిన డేటా ప్రకారం.. సుమారు కోటి మంది సిబ్బందికి తొలి టీకా అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలతో సహా ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. తొలిదశ దశలో వ్యాక్సినేషన్​లో టీకా పంపణీ, లబ్ధిదారుల ధ్రువీకరణ వంటి కీలక అంశాలకు సంబంధించి మానవ వనరుల ఏర్పాటు, ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఈ కసరత్తు మరో వారంలో పూర్తి కానుంది.

టీకా పంపిణీ వ్యూహాలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

ఇదీ చూడండి:కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details