తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై నవ భారత్​ విధానానికి ఆ దాడి నిదర్శనం' - కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

పాక్​లోని బాలాకోట్​ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడి జరిపి నేటికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, వైమానిక దళాలల ధైర్యసాహసాలను కొనియాడారు.

Balakot
బాలాకోట్

By

Published : Feb 26, 2021, 9:56 AM IST

పాకిస్థాన్​లోని బాలాకోట్​ ఉగ్ర శిబిరాలపై భారత్​ వైమానిక దాడి జరిపి నేటికి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వాయి సేన వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదం పట్ల భారత్​ వైఖరికి బాలాకోట్​ దాడి నిదర్శనమన్నారు. భారత వైమానిక దళాల పట్ల గర్వంగా ఉందన్నారు.

వైమానిక దళాలను ప్రశంసిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​

ఉగ్రవాదాన్ని తుదముట్టించేందకు నవభారత విధానానికి బాలాకోట్​ దాడి నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్​షా స్పష్టం చేశారు.

వైమానిక దళాలను ప్రశంసిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్వీట్​

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడింది తామే అని పాక్​కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అంగీకరించింది. అనంతరం పాకిస్థాన్​లోకి బాలాకోట్​లో ఫిబ్రవరి 26న మెరుపు దాడులు నిర్వహించింది భారత సైన్యం. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని సాహసోపేత చర్యకు ఉపక్రమించింది.

ఇదీ చూడండి:'బాలాకోట్​ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించారు'

ABOUT THE AUTHOR

...view details