Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు చేరింది.
Omicron Cases In Gujarat: బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ భారత సంతతి వ్యక్తి, యువకుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఇద్దరినీ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.
కేంద్రం, రాష్ట్రాల గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. మహారాష్ట్ర(48), దిల్లీ(22), రాజస్థాన్(17), కర్ణాటక(14), తెలంగాణ(20), గుజరాత్(9), కేరళ(11), ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, తమిళనాడు, బంగాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
శనివారం మహారాష్ట్రలో కొత్తగా 8కేసులు నమోదవగా, తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8నుంచి 20కు చేరింది. కర్ణాటకలో 6, కేరళలో 4 కేసులు వెలుగుచూశాయి.