తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు​.. 41కి చేరిన బాధితులు - ఒమిక్రాన్ కేసులు

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గుజరాత్​లోని సూరత్​లోనూ ఒకరికి ఒమిక్రాన్​ సోకింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.

omicron
ఒమిక్రాన్

By

Published : Dec 13, 2021, 10:08 PM IST

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

Omicron Case In Surat: మరోవైపు గుజరాత్​లోని సూరత్​లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 45ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్​ సోకినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్​లో మొత్తం బాధితుల సంఖ్య 4కు చేరింది. దీంతో భారత్​లో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 41కి చేరింది.

Omicron Cases In Maharashtra: ఈ రెండు కేసుల్లో ఒకటి లాథూర్​లో నమోదు కాగా మరొకటి పుణెలో వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో సోమవారం నమోదైన కేసులతో కలిపి.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 41కి చేరింది.

మరోవైపు ప్రపంచదేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది డెల్టా వేరియంట్​ను త్వరలోనే అధిగమించేలా ఉందని అభిప్రాయపడింది.

అయితే ఒమిక్రాన్​పై వ్యాక్సిన్​ పనితీరుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంది.

ఇదీ చూడండి:Omicron Variant News : వ్యాప్తిలో ఒమిక్రాన్ వేగం.. వ్యాక్సిన్‌తో దూరం

ABOUT THE AUTHOR

...view details