తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికపై 66 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం- షూటింగ్​కు వచ్చిన మోడల్​పై రేప్​ - బాలికపై గ్యాంగ్​ రేప్

Old Man Raped Girl : 12 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 66 ఏళ్ల వృద్ధుడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లో జరిగింది. మరో ఘటనలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Old Man Raped Girl
Old Man Raped Girl

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 10:53 PM IST

Old Man Raped Girl :ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లో దారుణం జరిగింది. 12 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 66 ఏళ్ల వృద్ధుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ జరిగింది
నిందితుడు హర్​దువాగంజ్​ పట్టణంలో కుట్టు మెషీన్​లు రిపేర్ చేస్తూ జీవిస్తున్నాడు. బాలిక సైతం అదే ప్రాంతంలో తండ్రి, నానమ్మతో కలిసి నివసిస్తోంది. తల్లి కొన్నేళ్ల క్రితమే చనిపోవడం వల్ల తండ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తూ బాలికను పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా, రూ.100 ఇస్తానంటూ ఆమెకు ఆశ పెట్టాడు నిందితుడు. అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అస్వస్థతకు గురికావడం వల్ల ఇంటికి పంపించాడు. బాలిక అనారోగ్యానికి గురైందన్న విషయాన్ని గ్రహించి కుటుంబసభ్యులు ఆరా తీయగా ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో నిందితుడిపై​పై పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

హోటల్​లో బాలికపై గ్యాంగ్ రేప్
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మరో ఘటన అలీగఢ్​లో జరిగింది. బాలికను నమ్మించిన ఓ యువకుడు హోటల్​కు తీసుకువచ్చాడు. అనంతరం తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. హోటల్​ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాలికను వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

షూటింగ్​ కోసం వచ్చిన మోడల్​పై రేప్
హిమాచల్​ప్రదేశ్​ రాజధాని శిమ్లాలో దారుణం జరిగింది. షూటింగ్​ కోసం వచ్చిన ఓ మోడల్​ను రేప్ చేశాడు ఓ వ్యక్తి. పంజాబ్​ జలంధర్​కు చెందిన 23 ఏళ్ల యువతి​ షూటింగ్​ కోసం శిమ్లాకు వచ్చింది. హోటల్​ రూమ్​లో ఉండగా ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది యువతి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన డిసెంబర్​ 22న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Girl Gangrape By 7People : 15ఏళ్ల బాలికపై ఏడుగురు గ్యాంగ్​రేప్​.. ఆ ఫొటోలు చూపిస్తూ.. బెదిరించి మరీ..

Girl Raped And Killed : చాక్లెట్​ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. సినీ ఫక్కీలో స్కెచ్​ వేసి నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details