ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పట్టణం ఎంతో పురాతనమైనది, విశిష్టమైనది. అక్కడ వందల సంవత్సరాలకు చెందిన పురాతన కట్టడాలు ఉన్నాయి. అక్కడ కొన్ని పురాతన భవనాలు కూలిపోకుండా వెదురు కర్రల ఆధారంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. అసలే వర్షాకాలం కాబట్టి పాతవైన ఆ భవనాలు ఏ క్షణమైనా కూలొచ్చు.
చారిత్రక నగరి బరువంతా 'వెదురు' కర్రలపైనే! - వెదురు కర్రల భవనాలు
వారణాసిలో పలు పురాతన భవనాలు వెదురు కర్రలపై ఆధారపడి ఉన్నాయి. వందలయేళ్లనాటి ఆ కట్టడాలు వర్షాకాలం కావడం వల్ల ఏ క్షణమైనా కూలొచ్చు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ముందస్తుగా ప్రజల్ని అక్కడినుంచి ఖాళీ చేయించి.. భవనాల్ని కూల్చడానికి సిద్ధమైంది.
శిథిలావస్థలో 'వెదురు' భవనాలు
దాంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఇది గమనించిన ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన 335 భవనాల్ని గుర్తించి వాటిని ముందస్తుగా కూల్చడానికి సిద్ధమైంది. ఆయా భవన యజమానులకు నోటీసులు కూడా పంపింది. అందులో 110 భవనాల్ని ఇప్పటికే కూల్చింది. మరికొన్ని కోర్టు కేసులలో ఉన్నందువల్ల కూల్చడానికి కొంచెం సమయం పడుతుందని మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రాతీ తెలిపారు.
ఇదీ చదవండి:వారణాసి.. పరమేశ్వరుని సృష్టి..
Last Updated : Jun 17, 2021, 7:44 PM IST