ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కన్న ఓ యువకుడికి వేల మంది ఆపన్నహస్తం అందించారు. చదువుకునేందుకు డబ్బు కావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన 3 గంటల్లోనే రూ. 37 లక్షలు డొనేషన్ రూపంలో అందించారు. ఈ ఘటన ఒడిశా కోరాపుట్‌లో జరిగింది.
ఆక్స్ఫర్డ్ లక్ష్యంగా..
దక్షిణ ఒడిశా కోరాపుట్ జిల్లాలోని మావోల ప్రాంతమైన తెంతులిపదార్ గ్రామానికి చెందిన సుమిత్ తురుక్.. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, ఆర్ధికంగా వెనకబడి ఉన్నందున.. తన ఆశ నెరవేరదేమోనని బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునేందుకు కావాల్సిన రూ. 47 లక్షలు ఒడిశా సర్కారు నుంచైనా పొందాలని అనుకున్నాడు. కానీ, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి సర్కారు సాయం చేయలేదని తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు అనుమతి లభించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతే.. మూడు గంటల్లో అతనికి డొనేషన్ల రూపంలో రూ. 37లక్షలు అందాయి. జూన్ 30 కల్లా మిగతా 10 లక్షల రూపాయలు సేకరించగలనని ధీమా వ్యక్తం చేశాడు.