జగన్నాథ స్వామిపై భక్తిని తన కళ ద్వారా వ్యక్తపరుస్తున్నారు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సూక్ష్మ కళాకారిణి ప్రియాంకా సాహ్నీ. చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, ఆకులు, బిస్కెట్లు సహా పలు వస్తువులపై సూక్ష్మరూపంలో 108 చిత్రాలను గీశారు ప్రియాంక. వాటిల్లో పూరీ జగన్నాథుని చిత్రాలతో పాటు అతని సోదరసోదరీమణుల కళాకృతులను రూపొందించారు. సోమవారం.. స్వామివారికి రథయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కళాకృతులను ప్రియాంక చిత్రించారు.
"కేక్ స్టాండ్స్, జాక్‌ఫ్రూట్, నారింజా, ఓరియో బిస్కెట్లు సహా పలు వస్తువులపై స్వామివారి చిత్రాలు వేశాను. అది చాలా కష్టమైన పని. అందుకు చాలా శ్రమించాను" అని ప్రియాంక వివరించారు.