దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి(durga navratri) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో విధంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు నిర్వహకులు. దేవిని పుష్పాలు, వివిధ రకాల ఆకులతో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో దుర్గమ్మను వినూత్నంగా కనిపించేలా కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నారు. ఒడిశాలోని కటక్‌లో కొలువైన దుర్గమ్మను కిలోల కొద్ది బంగారం, వెండితో అలంకరించారు.
కటక్ చౌధురి బజార్‌లోని కొలువుదీరిన దేవి విగ్రహాన్ని(durga puja) ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 250 కేజీల వెండి, 40 నుంచి 50 కిలోల బంగారంతో అలంకరించారు. ఈ బంగారు ఆభరణ అలంకరణతో ఎంతో రమణీయంగా అమ్మవారు దర్శనమిస్తోంది.
అమ్మవారిని చూడటానికి పెద్దఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు కటక్ మున్సిపల్ అధికారులు తెలిపారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవడం వల్ల రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్‌కర్ఫ్యూ అమలవుతోందని పేర్కొన్నారు.