తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడుతోనే బడి బంద్​.. ప్లాస్టిక్, పాలిథీన్​తో పెట్రోల్.. లీటర్​కు 50కి.మీ మైలేజ్!

Odisha boy innovation: ఒడిశాకు చెందిన ఓ యువకుడు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్​ను ఉపయోగించి పెట్రోల్, గ్యాస్ తయారు చేస్తున్నాడు.

Odisha boy innovation
ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్​ను ఉపయోగించి పెట్రోల్, గ్యాస్ తయారీ

By

Published : May 6, 2022, 3:09 PM IST

ఏడుతోనే బడి బంద్​.. ప్లాస్టిక్, పాలిథీన్​తో పెట్రోల్.. యువకుడి ప్రతిభకు అంతా ఫిదా!

Odisha boy innovation: చదివింది ఏడో తరగతి. చేస్తుంది ఎలక్ట్రిషియన్ ఉద్యోగం. అయితేనేం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ఆ యువకుడు. పాలిథీన్​, ప్లాస్టిక్​ బాటిళ్లను ఉపయోగించి పెట్రోల్​, గ్యాస్​ను వెలికితీస్తున్నాడు ఒడిశాకు చెందిన అజయ్​ బెహరా. తాను తయారుచేసిన లీటర్​ పెట్రోల్​తో బైక్​పై 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ప్రభుత్వం సాయమందిస్తే మరిన్ని పరిశోధనలు చేస్తానని, తక్కువ ధరకే పెట్రోల్​ లభిస్తుందని అంటున్నాడు.

పెట్రోల్ తయారీ యంత్రాలు
పాలిథీన్​తో పెట్రోల్​ను తయారుచేసిన అజయ్

వృథాగా పోయే ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ వస్తువులను ఉపయోగించి పెట్రోల్​ను తయారు చేస్తున్నాడు రాధాచరణ్​పుర్​లో ఉండే అజయ్. రోజుకు 12 నుంచి 13 కేజీల పాలిథీన్​ను సేకరిస్తున్నాడు. దీంతో సుమారు 7-8 లీటర్ల పెట్రోల్​ను తయారుచేస్తున్నాడు. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్​ను తగ్గించడంలోనూ యువకుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ​తన లక్ష్యం కోసం సొంత బైక్​ను 80 వేల రూపాయలకు అమ్మేశాడు. స్నేహితుల వద్ద కొంత అప్పు చేసి.. పెట్రోల్ తయారుచేసే యంత్రాన్ని​ కొన్నాడు. అలా పాలిథీన్, వాటర్​ బాటిళ్లను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండించి పెట్రోల్​ను తయారు చేస్తున్నాడు అజయ్. ఒక కేజీ పాలిథీన్​తో 600 గ్రాముల పెట్రోల్​ తయారవుతుందని అంటున్నాడు. అతడి కృషి పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాలిథీన్​తో తయారుచేసిన పెట్రోల్​ను బైక్​కు వాడుతున్న అజయ్

ఇదీ చదవండి:ఆ జిల్లాలో మంకీ ఫీవర్ కలకలం.. ఆసుపత్రులకు జనం పరుగులు!​

ABOUT THE AUTHOR

...view details