Nurse Stabbed To Death In Patna : బిహార్.. పట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ కత్తితో పొడిచి ఓ నర్సును దారుణంగా హత్య చేశాడో దుండగుడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూర్ణియా జిల్లాకు చెందిన సోని కుమారి అనే 25 ఏళ్ల మహిళ పట్నాలోని కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదాంత ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. నిందితుడు.. సోనితోపాటు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరి మధ్య ఏదో గొడవ తలెత్తింది. అనంతరం నిందితుడు కత్తితో మహిళపై దాడి చేశాడు. పొట్ట, ఛాతీ భాగంలో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే నిందితుడి వయసు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు కంకర్బాక్ ఇన్‌ఛార్జి రవిశంకర్ తెలిపారు. బాధితురాలికి నిందితుడు పరిచయం ఉన్నాడని వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే హత్యకు గల కారణం తెలుస్తుందన్నారు. ప్రస్తుతం తాము సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చోరీకి వచ్చి దంపతుల హత్య..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు.. ప్రతిఘటించిన దంపతులను హత్య చేశారు. ఓ వెబ్‌సిరీస్ ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు.. పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?.