తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NTR Centenary Celebrations: ఎన్టీఆర్‌ యుగపురుషుడు: రజనీకాంత్‌

Tamil Super Star Rajanikanth : అన్న ఎన్టీఆర్ డైలాగ్‌లు వినే తెలుగు నేర్చుకున్నానని, నటనలో ఆయనే తనకు స్ఫూర్తి అని సూపర్‌స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీ.... చంద్రబాబు రూపొందించిన విజన్‌ 2047 అమలైతే.. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.

Rajinikanth
Rajinikanth

By

Published : Apr 28, 2023, 8:11 PM IST

Updated : Apr 29, 2023, 6:23 AM IST

Tamil Super Star Rajanikanth : ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని, ఆయనపై అభిమానాన్ని గుర్తు చేసుకున్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎన్టీఆర్ యుగపురుషుడు అని కొనియాడారు. తన జీవితంలో ఆనందంతో ఎగిరి గంతేసిన క్షణాలు రెండు సార్లు మాత్రమే అయితే.. అందులో మొదటిది ఎన్టీఆర్ భారీ విజయంతో ముఖ్యమంత్రి కావడం, రెండోది.. హిమాలయ పర్వతాలను ప్రత్యక్షంగా చూడడం అని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల అంకురార్పణ సభకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన తీరు.. అటు తెలుగు దేశం శ్రేణులను, ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది.. ఆలోచింపజేసింది.

నేను చూసిన మొదటి చిత్రం పాతాళ భైరవి.. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పారు. తాను ఆరేడేళ్ల వయసులో చూసిన తొలి సినిమా పాతాళభైరవి అని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత 'లవకుశ' సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్‌ను చూశానని, శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్‌ను చూసి మైమరిచిపోయానని తెలిపారు. కండక్టర్‌ అయ్యాక ఎన్టీఆర్‌ను అనుకరిస్తుంటే.. సన్నిహితులు సినీరంగంలోకి రావాలని ప్రోత్సహించారని వెల్లడించారు.

1977లో టైగర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించానని, సినిమాలోనే కాకుండా బయట కూడా మంచి ఎన్టీఆర్​ది గొప్ప వ్యక్తిత్వమని రజనీకాంత్ కొనియాడారు. ఎన్టీఆర్ బహుముఖ పాత్ర పోషించి నటించిన దానవీరశూరకర్ణ చూసి... అదే పాత్రలో నటించాలనుకున్నానని చెప్పిన రజనీ... స్వయంగా ఎన్టీఆర్‌ మేకప్‌మ్యాన్‌ వచ్చి తనకు తిలకం దిద్దినా.. ఆ వేషం తనకు సెట్ కాలేదని సన్నిహితుడు చెప్పినట్లు వెల్లడించారు.

చంద్రబాబు విజన్ ఆంధ్రప్రదేశ్​కు వెలుగు రేఖ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజన్ గురించే ఆలోచిస్తారని తమిళ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అన్నారు. సభను చూస్తే రాజకీయాలు మాట్లాడాలనిపిస్తోందని... కానీ, అనుభవం రాజకీయాలు మాట్లాడవద్దని హెచ్చరిస్తోందని చెప్పారు. కానీ ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గురించైనా రాజకీయం మాట్లాడక తప్పడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు గురించి రాజకీయం మాట్లాడకుంటే అది నాగరికం కాదన్నారు. 4నెలల క్రితం చంద్రబాబు ని కలిస్తే విజన్ 2047గురించి చెప్పారని... అది సాకారమైతే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడికో వెళ్లిపోతుందని అన్నారు. చంద్రబాబు విజన్ 2047 నెరవేరాలని, ఆశక్తి భగవంతుడు ఆయనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రపంచ రాజకీయాలు తెలిసిన నేత చంద్రబాబు అని కొనియాడారు. పరిపాలనలో చంద్రబాబు దూరదృష్టి ఏంటో ఇక్కడి వారికి తెలియకపోవచ్చు కానీ దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నేతలకంతా తెలుసని చెప్పారు. ఆయన ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తుచేశారు. హైదరాబాదులో సైబరాబాద్ వైపు ఓసారి వెళ్లాను.. ఇండియాలో ఉన్నానా..? న్యూయార్క్ లో ఉన్నానా అని అనిపించిందన్నారు. హైదరబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని చెప్పారు. బాలయ్యను తన తమ్ముడిగా రజనీకాంత్‌ అభివర్ణించారు. బాలయ్యలో ఎన్టీఆరును చూస్తున్నానన్న రజనీకాంత్‌... ఆయన ఏం చేసినా జనం చూస్తారని చెప్పారు. బాలయ్యకు కోపం ఎక్కువ.. కానీ మనస్సు వెన్న అని కొనియాడారు.

బాలయ్యకు కోపం ఎక్కువైనా మనసు మాత్రం వెన్న: కంటిచూపుతోనే చంపేస్తాననే బాలకృష్ణ తన మిత్రుడన్న రజనీ... బాలయ్యలా రజనీకాంత్‌, షారుక్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌ ఎవరు చేసినా ప్రేక్షకులు అంగీకరించరన్నారు. అభిమానులు నందమూరి తారకరామారావుని బాలకృష్ణలో చూసుకుంటున్నారని తెలిపారు. ఆయనకు కోపం ఎక్కువైనా మనసు వెన్నలాంటిదన్నారు. సినీ, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఎన్టీఆర్‌ యుగపురుషుడు: రజనీకాంత్‌

ఇవీ చదవండి :

Last Updated : Apr 29, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details