తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ పరికరంతో కీటకాలకు శిక్ష.. పంటకు శ్రీరామ రక్ష!

కీటకాల నుంచి పంటలను కాపాడి, రైతులకు అధిక దిగుబడి అందించే విధంగా అధునాతన పరికరాన్ని తయారు చేశారు ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు. ఒడిశా కటక్​లోని ఐకార్- జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు. సౌరశక్తిని వినియోగించుకుని ఈ పరికరం పనిచేసేలా అభివృద్ధి చేశారు. ఈ పరికరంతో పంటపొలాల్లో, ఉద్యానవనాల్లో ఎలాంటి కీటకాలు సంచరిస్తున్నాయో గుర్తించి వాటి నుంచి పంటలను, తోటలను కాపాడుకోవచ్చని వివరించారు.

NRRI develops device for pest management, patents it
కీటకాల నుంచి పంటను రక్షించే అధునాతన పరికరం

By

Published : Mar 3, 2021, 11:40 AM IST

Updated : Mar 3, 2021, 2:36 PM IST

ఈ పరికరంతో కీటకాలకు శిక్ష.. పంటకు శ్రీరామ రక్ష!

క్రిమిసంహారక మందులు అవసరం లేకుండా కీటకాల నుంచి పంటలను కాపాడేందుకు అధునాతన పరికరాన్ని తయారు చేశారు ఒడిశా కటక్​లోని ఐకార్-జాతీయ ధాన్య పరిశోధనా సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలు. పూర్తిగా సౌరశక్తితో పనిచేసేలా ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ నూతన ఆవిష్కరణకు పేటెంట్​ హక్కులను సైతం పొందారు. ఈ పరికరం ద్వారా రైతులు.. తమ పంట పొలాల్లో ఎలాంటి క్రిమికీటకాలు ఉన్నాయో గుర్తించి.. వాటిబారి నుంచి పంటలను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.

"అధునాతన సాంకేతికతను జోడించి రెండు రకాల ఆల్టర్​నేట్ ఎనర్జీ లైట్​ ట్రాప్ ​(ఏఈఎల్​టీ) పరికరాలను తయారు చేశాం. రూ.8,800 ఖర్చుతో తయారు చేసిన ఈ పరికరంతో ఒక హెక్టార్​ పరిధిలోని పంటను క్రిమికీటకాలను నుంచి కాపాడవచ్చు. ఈ పరికరంలో మినీ వర్షన్ కూడా ఉంది. రూ. 4,100 ఖర్చుతో చేసిన ఈ పరికరం ఒక ఎకరం పంటను రక్షిస్తుంది. మేము మహారాష్ట్రకు చెందిన కంపెనీతో పేటెంట్​ హక్కులను పంచుకున్నాం. పరికరాల ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తాం."

-- డా. శ్యామ్​రంజన్​ దాస్​ మోహపాత్ర, సీనియర్​ శాస్త్రవేత్త

ఈ అధునాతన విధానంతో ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల విలువగల పంటలను క్రిమికీటకాల బారి నుంచి రక్షించవచ్చని సీనియర్ శాస్త్రవేత్త మోహపాత్ర తెలిపారు.

ఎలా పనిచేస్తుంది?

అధునాతన ఆల్టర్​నేట్ ఎనర్జీ లైట్​ ట్రాప్ ​(ఏఈఎల్​టీ) పరికరం
ఆల్టర్​నేట్ ఎనర్జీ లైట్​ ట్రాప్ ​(ఏఈఎల్​టీ) పరికరంతో డా. శ్యామ్​రంజన్​ దాస్​ మోహపాత్ర

ఆల్టర్​నేట్ ఎనర్జీ లైట్​ ట్రాప్​(ఏఈఎల్​టీ) పరికరం పంట పొలంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో లైట్​ ట్రాప్ పరికరం ఉంటుంది. ఈ పరికరం కీటకాలను ఆకర్షిస్తుంది. ఈ పరికరంపై వాలిన కీటకాలను కలెక్టర్​ అనే పరికరం లోపలికి తీసుకుంటుంది.

ఈ పరికరం తక్కువ ధరకే లభిస్తుందని శాస్త్రవేత్త మోహపాత్ర తెలిపారు. ఈ విధానం పర్యావరణ రహితమని వివరించారు.

ఇదీ చదవండి:28 గంటలు మంత్రాలు జపించి మహిళ ప్రపంచ రికార్డు

Last Updated : Mar 3, 2021, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details