తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అది నిందితుల హక్కులను కాలరాయడమే'

బెయిల్​ పిటిషన్​పై విచారణ చేయకపోవడం నిందితుడి హక్కులను కాలరాయడమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వేళ అత్యవసర విచారణ కోసం న్యాయమూర్తులు కనీసం సగం మంది రోజు విడిచి రోజు విధులు నిర్వహించాలని ఆదేశించింది.

Supreme court
సుప్రీం కోర్టు

By

Published : Jun 17, 2021, 5:39 AM IST

Updated : Jun 17, 2021, 7:30 AM IST

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న పరిస్ధితుల్లో అత్యవసర విచారణ కోసం కోర్టుల్లో న్యాయమూర్తులు కనీసం సగం మంది అయినా రోజు మార్చి రోజు విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్‌ కోసం ఓ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏడాది గడిచినా పంజాబ్‌, హరియాణా హైకోర్టు విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

బెయిల్‌ పిటిషన్‌ను అసలు విచారణ కేసుల జాబితాలోనే చేర్చకపోవడం.. న్యాయపాలను పరాభవానికి గురి చేయడమే అని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది నిందితుని హక్కును కాలరాయడం అని పేర్కొంది. నిందితుని బెయిల్‌ పిటిషన్‌పై పంజాబ్‌, హరియాణా హైకోర్టు సత్వరమే విచారణ జరపగలదని ఆశిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ఇదీ చూడండి:ఆ కేసు విచారణ నిలిపివేయాలని సుప్రీం కీలక తీర్పు

Last Updated : Jun 17, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details