తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా తీసుకుంటే పిల్లలు పుట్టరా? నిపుణుల మాటేంటి? - భారత్​లో వ్యాక్సినేషన్​

కరోనా వ్యాక్సిన్​.. సంతానలేమికి కారణమవుతుందని వస్తున్న వార్తలను ఖండించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. టీకా వేయించుకున్న మహిళలు, పురుషుల్లో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాల్లేవని స్పష్టం చేసింది.

No scientific evidence found linking Covid vaccination with infertility
టీకా తీసుకుంటే పిల్లలు పుట్టరా

By

Published : Jun 30, 2021, 6:24 PM IST

కొవిడ్​ టీకాతో సంతానలేమికి సంబంధం లేదని తేల్చిచెప్పింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వ్యాక్సిన్​ తీసుకునే పురుషులు, మహిళలు వంధ్యత్వం బారినపడే ముప్పు ఉందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. వాటిని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది.

కరోనా వ్యాక్సిన్లు సురక్షితమని, సమర్థంగానే పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సిన్​ అడ్మినిస్ట్రేషన్​(ఎన్​ఈజీవీఏసీ)కూడా.. పాలిచ్చే తల్లులకు టీకా ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు కేంద్రం తెలిపింది. టీకాకు ముందు, తర్వాత కూడా పాలు ఇవ్వొచ్చని పేర్కొంది.

సురక్షితం అయితేనే..

టీకా తీసుకుంటే సంతాన లేమి సమస్యలు తలెత్తుతాయని వస్తున్న వార్తలపై మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్లు సంతానోత్పత్తిపై ఏ మాత్రం ప్రభావం చూపవని వెల్లడించింది.

తొలుత జంతువులపై, తర్వాత మనుషులపై టీకా ప్రయోగించి చూస్తారని.. సురక్షితం అని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతిస్తారని వివరించింది.

ఇదీ చదవండి: ప్రైవేటు టీకా కేంద్రాలకు జులై 1 నుంచి కొత్త రూల్స్​!

ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న మార్పు చాలు!

ABOUT THE AUTHOR

...view details