తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం ఎవరో తెలియదు.. రేపే ప్రమాణ స్వీకారం!

అసోం సీఎం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇందుకు సంబంధించి రాజ్​భవన్​కు లేఖ రాశారు. అయితే ఎవరిని సీఎం చేయాలనే అంశంపై భాజపా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

By

Published : May 6, 2021, 5:39 PM IST

Updated : May 6, 2021, 6:10 PM IST

CM
అసోం సీఎం

అసోం సీఎం ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉంటుందని అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా.. రాజ్​భవన్​కు లేఖ రాశారు.

ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనప్పటీ సీఎం ఎవరన్నది భాజపా ప్రకటించలేదు. సీఎం పీఠం కోసం గత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, వైద్య, ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. సర్బానంద సోనోవాల్​నే మళ్లీ సీఎం చేయాలని కొందరు భాజపా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. హిమంత బిశ్వ శర్మకు అవకాశం ఇవ్వాలన్నది మరికొందరి వాదన.

సర్బానంద సోనోవాల్
హిమంత బిశ్వ శర్మ

సీఎం ఎవరిని చేయాలన్నదానిపై భాజపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రభాజపా తెలిపింది. ఇందుకోసం భాజపా పార్లమెంటరీ భేటీ కావాల్సి ఉండగా.. ఇంతవరకు జరగలేదు.

ఇదీ చదవండి:అసోంలో సీఎం పీఠం ఎవరికి.?

Last Updated : May 6, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details